ఆగస్టు 15న అమెరికాకు వెళ్లనున్న వైఎస్ జగన్!

  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం హైదరాబాద్ కు
  • అదే రోజు రాత్రికి కుటుంబీకులతో కలిసి అమెరికాకు
  • వర్షారెడ్డిని గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించి తిరిగి రాక
  • 24 రాత్రికి తిరిగి రానున్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 15, గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళుతున్నారు. 15న విజయవాడ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆయన, అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని, రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లనున్నారు. తిరిగి 24వ తేదీ రాత్రి తాడేపల్లికి తిరిగి వస్తారని సీఎం కార్యాలయం వెల్లడించింది. తన చిన్న కుమార్తె వర్షారెడ్డిని యూఎస్ లోని ఓ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేర్పించేందుకు ఆయన వెళ్లనున్నట్టు సమాచారం. ఇదే సమయంలో 17వ తేదీన డల్లాస్‌లోని కే బెయిలీ హచిసెన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నార్త్ అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
Go Back to Shorts
Jagan
Amerika
USA
Varsha Reddy

More Telugu News